Take a fresh look at your lifestyle.

రాంజీ గోండు త్యాగం మరువలేనిది బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్

 

ముద్ర ప్రతినిధి,నిర్మల్:

నిర్మల్ గడ్డపై నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన వెయ్యి మంది వీరులను స్మరించు కోవాలని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ కొనియాడారు. రాంజీ గోండ్ వర్ధంతి సందర్బంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని చైన్ గేట్ లో విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏక కాలంలో అంగ్లేయులు, నైజాం పాలకులతో పోరాటం సాగించి ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని ఈ నేలపై నడిపిన గోండ్ వీరుడే రాంజీ గోండ్ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, మేడిసిమ్మే రాజు, జిల్లా కార్యదర్శి అల్లం భాస్కర్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, సీనియర్ నాయకులు అయ్యన్న గారి రాజేందర్, కందుల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.