Take a fresh look at your lifestyle.

టెండర్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణాభివృద్ధికి మంజూరైన రూ.15 కోట్ల నిధుల టెండర్లను రద్దును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషి ఫలితంగానే నిర్మల్ పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చారని గుర్తు చేశారు. ఈ మేరకే కేంద్ర ప్రభుత్వం ద్వారా అమృత్ పథకం కింద మొదటగా 62.50 కోట్లతో పట్టణంలో త్రాగు నీటి సౌకర్యానికి మంజూరైనట్లు తెలిపారు. అలాగే మురికి నీటి శుద్ధి కోసం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.42 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి అత్యవరంగా రూ.50 కోట్లు అవసరమని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంకు ప్రతిపాదిస్తే రూ. 15 కోట్లు మంజూరు చేశారన్నారు. కాగా మున్సిపల్ లో కొత్తగా పాలనలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధిని అడ్డుకునేలా తీసుకున్న ఈ టెండర్ రద్దు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత రావుల రామ్ నాథ్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, సీనియర్ నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ బీజేపీ కౌన్సిలర్లు సాదం అరవింద్, గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, శాంశంక్, ఖమ్మం సురేందర్, జింక సూరి, సాత్విక్, సూరజ్ నాయక్, విఠల్, డా. కృష్ణ మోహన్, ముత్యం, ఈశ్వర్, తో పాటు మాజీ కౌన్సిలర్లు, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.