Take a fresh look at your lifestyle.

ఏప్రిల్ 3న నారాయణ పేటలో హిందూ సమ్మేళనం హైందవ సోదరీ సోదరీమణులు తరలిరావాలని పిలుపు

 

ముద్ర, నారాయణ పేట:

నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగర్ బేస్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 3 న సాయంత్రం 6 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని హిందూ సమ్మేళన కార్యక్రమ కమిటీ అధ్యక్షులు గుంపు బాలరాజ్ ప్రకటనలో తెలిపారు. హిందూ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పది ఉప బస్తీల నుంచి ఆధ్యాత్మిక భజన సంకీర్తనలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కార్యక్రమానికి కాలినడకన హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమ విజయవంతం పై కమిటీ సభ్యులు ప్రత్యేక సమావేశమయ్యారు. హిందూ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ముందుగా యజ్ఞ కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ ముఖ్య వక్త సందేశం ఉంటుందని తెలిపారు. భారతదేశానికి ఆత్మ ప్రాణం హిందూధర్మం అని అటువంటి హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి సమైక్యపరచి మన దేశాన్ని విశ్వ గురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ ఐక్యతను సమర సతను చాటాలని కోరారు. అనంతరం ఆత్మీయ హిందూ సమ్మేళన కమిటీని పాలమూరు జిల్లా సహకార్య వాహ మ్యాడమ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుంపు బాలరాజ్, ఉపాధ్యక్షులుగా దత్తు చిల్లాల్, రాజ్ కుమార్ దోత్రే, వినోద్, విజయలక్ష్మి, కొండోళ్ల రాములు, కార్యదర్శిగా యశ్వంత్, సహకార దర్శులుగా ఉదయ్ కుమార్, చిన్నరఘు, కిరణ్ మరి కొంతమంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.