Take a fresh look at your lifestyle.

సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు

 

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలను గురువారం ప్రజలు సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు. వేకువజామునే ప్రజలు మామిడి, వేప తోరణాలు, పూలతో ఇళ్లను అలంకరించి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని దేవతలకు నైవే ద్యంగా సమర్పించి అందరికి పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంతో పాటు గద్వాల ధరూర్,‌మల్దకల్ కేటి దొడ్డి,‌ గట్టు, తదితర మండలాలలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని
ప్రముఖ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ అర్చకు లు నూతన తెలుగు సంవత్సరాది పరాభవ నామసంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. ఈ నూతన సంవత్సం అందరి జీవితాల్లో వెలుగు నింపాలని కోరా‌రు.
రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అరకలతో తొలి దుక్కులు దున్నారు.

గద్వాల పట్టణంలోని శ్రీ సుంకులమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు సుంకులమ్మ అవ్వను దర్శించుకుని నైవేధ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో ఉగాది పండుగ రోజున కోళ్లను కోసి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఇక్కడి ఆనవాయితిగా మారింది.

Leave A Reply

Your email address will not be published.