Take a fresh look at your lifestyle.

నేరా పరిశోధన, భద్రతలో పోలీస్ డాగ్ పాత్ర కీలకమైనది: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నేర పరిశోధన, భద్రతా చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ,విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పేర్కొన్నారు.జగిత్యాల పట్టణంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానం లో పోలీస్ శాఖ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను,డాగ్ కెన్నెల్క్ రూమ్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ముందుగా కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ డాగ్ ల శిక్షణా సామర్థ్యం వల్ల పోలీసులు విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నారని అన్నారు.ఇంతకు ముందు ఎస్ ఆర్ ఎస్పీ క్వార్టర్స్ లో ఉండేదని అక్కడ సరైన వసతులు లేవని జిల్లా ఎస్పీ మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగిందని.వీటికి శాశ్వతంగా గదులను కేటాయించాలని ఉద్దేశంతో వీటిని ప్రారంభించడం జరిగింది అని అన్నారు.జగిత్యాల నేరాల నిరోధం,విచారణ,భద్రతాపరమైన చర్యల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని, వీటి అధిక సామర్థ్యం,విశ్వసనీయత,ప్రత్యేక శిక్షణ కారణంగా పోలీస్ వారికి ఎంతగానో సహాయపడతాయి అని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ ను ఎస్పీ అశోక్ కుమార్ ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో, ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.