ముద్ర, తాండూర్:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని గ్రంథాలయ శాఖ ఆవరణలో చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం అందరం ఆరోగ్యంగా జీవించగలమని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర జోనల్ అధ్యక్షులు వడ్డే సాయిలు రాజన్న, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పకీరప్ప, జనరల్ సెక్రెటరీ కిష్టప్ప, మరియు గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.