* అంబెడ్కర్ రాజ్యాంగం సూచించిన విధంగా పేదలకు అన్ని హక్కులు కల్పించాలి
* ఈ నెల 21 న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా విజయవంతం చేయాలి
ముద్ర ప్రతినిధి,సిద్దిపేట :
రాజ్యాంగం నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రెడ్దిల్లో ఉన్న పేదలకు అన్ని హక్కులు కల్పించాలని రెడ్డి సంఘాల JAC నాయకులు డిమాండ్ చేశారు. అంబెడ్కర్ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రెడ్డి సంఘాల నాయకులతో కలిసి బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ రెడ్డి లో అనేక మంది పేదలు ఉన్నారని ప్రభుత్వం అందించే సంక్షేమ పతకాలు వారికి కుడా అందాలన్నది తమ లక్ష్యం అన్నారు. గత ప్రభుత్వం లో కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన అది నెరవేర్చలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. రెడ్డిల్లో ఉన్న పేదవారికి అండగా నిలబడాలన్నారు. రెండేళ్ల క్రితమే రెడ్డి కార్పొరేషన్ కోసం కాబినెట్ లో ఆమోదం పొందిన ఇప్పటివరకు నిధులు కేటాయించలేదన్నారు. రిజర్వేషన్ పొందే వారితో మాకు ఎలాంటి అక్షేపన లేదని కాని రెడ్డి లో ఉన్న పేదలకు సరైన సంక్షమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు కు ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. ఈ నెల 21 సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించబోయే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్పొరేషన్ సాధించే వరకు తమ పోరాటం ఆగడన్నారు.