– గోటూరి రవీందర్ గౌడ్ విజ్ఞప్తి
ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వెంటనే కులగణన జరిపించాలని బీసీ పొలిటికల్ జేఏసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్ గౌడ్ కోరారు. ఆదివారంనాడు హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి బహిరంగ సభలో ఈ మేరకు స్పష్టమైన హామీ ఇవ్వాలని రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
సమగ్ర కులగణనతో కూడిన జనగణనకు తేదీని ప్రకటించాలని ఆయన అన్నారు. దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో, ఉద్యోగాల్లో, నిధుల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కూడా రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు