Take a fresh look at your lifestyle.

ఎన్ పి ఆర్ డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాల దగ్ధం…

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోశనివారం వినాయక చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంపై రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు.
ఈ సందర్బంగా సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురూపంగా ప్రకాష్, వనం ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన 3,24,234 కోట్ల బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం నిధులు కేటాయించాలని కానీ బడ్జెట్ కేటాయింపుల్లో వికలాంగుల సంక్షేమ శాఖను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2025-26 బడ్జెట్లో 77 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో నిధుల కేటాయింపులో ఎలాంటి పురోగతి లేదని మహిళా,శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు 3143 కోట్లు కేటాయించిందని, ఇందులో వికలాంగుల సంక్షేమనికి ఎంత కేటాయించారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో కాంట్రాక్టులు , కమిషన్స్ కోసమే నిధులు కేటాయించారు తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమనికి నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను సవరించి వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, భువనగిరి మండల నాయకులు పాండాల శ్రీహరి, ఎండి సలాం, గోపి, దండ బోయిన గణేష్, రాసాల నవీన్, కృష్ణయ్య, కృష్ణయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.