జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 6 నుండి 11 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
శనివారం కలెక్టరేట్ లో జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. 6న ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే సందర్భంగా ఆహార కల్తీపై ప్రజల్లో అవగాహన పెంపు కోసం ఉదయం 6:30 గంటలకు భువనగిరి పాత బస్ స్టాండ్ నుండి వినాయక చౌరస్తా ద్వారా జూనియర్ కాలేజీ గ్రౌండ్ వరకు ఈట్ రైట్ వాక్, అవగాహన ర్యాలీ నిర్వహించాలన్నారు. 7న వరల్డ్ హెల్త్ డే ను పురస్కరించుకొని జిల్లా స్థాయిలో హెల్త్ ప్రతిజ్ఞ, ఉత్తమంగా సేవలందిస్తున్న వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పరామెడికల్ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేయడం,
8న సేఫ్ మదర్ డే సందర్భంగా మాతృ, శిశు మరణాలను తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు, 9న ఎయిడ్స్ అవగాహన & నివారణ దినం, 10న ఆయుష్, హోమియోపతి దినం, 11న డ్రగ్స్ కంట్రోల్, రెగ్యులేటరీ స్ట్రెంగ్తెనింగ్ డే సందర్భంగా ప్రభుత్వం, తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యం.మనోహర్, యస్.చిన్న నాయక్, రాజేందర్ పాల్గొన్నారు.