Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్క రాజ్ కుమార్ రెడ్డి నియామకం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జక్క రాజ్ కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, తనపై ఉంచిన నమ్మకం, బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జిల్లా డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు సంపూర్ణ నిబద్ధతతో కృషి చేస్తానని జక్క రాజ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.