Take a fresh look at your lifestyle.

భువనగిరిలోని హనుమాన్ వాడ మహిళా సంఘాల సభ్యుల ఆందోళన

 
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలో మహిళా సంఘాల డబ్బులను ఆర్పిలు సువర్ణ , దివ్య సభ్యులకు తెలవకుండా డ్రా చేసుకొని సొంతంగా వాడుకున్నారని వారిని కఠినంగా శిక్షించాలని హనుమాన్ వాడ మహిళా సంఘాల సభ్యులు సోమవారం రాత్రి ఆందోళన దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
సంతకాల ఫోర్జరీ చేసి సభ్యులు లేకుండానే ఆర్పీల చేతులకు డబ్బులను ఇచ్చిన కెనరా బ్యాంక్ ఇంచార్జ్ రమేష్ బాబు, కెనరా బ్యాంక్ సిబ్బందిపై కేసులు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక్కో సంఘానికి సంబంధించి 20 లక్షల వరకు డ్రా చేసుకుని ఆర్పీలు కోట్ల రూపాయల నిధులను సొంతంగా వాడుకున్నారని వారిని ఎక్కడ ఉన్న పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.