టెండర్ల రద్దుకై పోరాటాలకు సిద్ధం కండి. -తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్.
ముద్ర మోత్కూర్:
టెండర్లు రద్దు చేసి టెస్కో నుండే గురుకుల పాఠశాలల విద్యార్థులకు ఏక రూప దుస్తులు, దుప్పట్లు, కొనుగోలు చేయాలనీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెండర్లు రద్దు చేయక పొతే ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.రాష్ట్ర విద్యా శాఖ 2026-27 విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల తయారు చేయాలని 105.54 కోట్ల రూపాయల ఆర్డర్ ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన టెస్కో కు ఇచ్చింది. ఇచ్చిన ఆర్డర్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోని టెస్కోకు షాక్ ఇచ్చి ప్రయివేట్ వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయుటకు విద్యా శాఖ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఉపాధిని ఊడగొట్టడమే 393 చేనేత పారిశ్రామిక సహాకార సంఘాలలో పని చేస్తున్న వేలాది చేనేత కార్మికుల పొట్ట కొట్టి నడి బజార్ లో పడేయడమే అని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ అన్నారు.ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసమే పని చేయాలని, వారి ఉపాధి కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వం పైన ఉన్నదని గుర్తు చేశారు.
ప్రభుత్వం తమ భాధ్యత మర్చిపోతే ఉద్యమాలు పోరాటం ద్వారా గుర్తు చేయాల్సిన బాధ్యత చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమ మీద ఉన్నదని అన్నారు.తెలంగాణ చేనేత కార్మిక సంఘం పిలుపుతో 2025 నవంబర్ 20 వ తేదీన కమిషనర్ కార్యాలయం ముందు వేలాది మంది చేసిన ధర్నాతో వేలాది మంది చేనేత కార్మికులకు ఋణమాఫీ జరిగిందని అన్నారు. మార్చి 25 న ఇందిరా పార్కు హైదరాబాద్ వద్ద జరిగిన ధర్నాతో రాష్ట్రంలో నిన్న జరిగిన గ్రామ సభలలో వేలాది మంది చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం అమలు అయ్యింది. జియో టాగ్ ఉన్న చేనేత కార్మికులకు 4500/- రూపాయలు అనుబంధ కార్మికులకు 1500/- చొప్పున మంజూరు అయినవి. వాటిని త్వరలో హ్యాండ్ లూమ్ టెక్స్ టైల్ అసిస్టెంట్ డైరెక్టర్ పంపిణీ చేస్తారు. 13 సంవత్సరాల నుండి ఎన్నికలు జరగకుండా ఉన్న చేనేత పారిశ్రామిక సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలని చేనేత కార్మికుల పోరాటం వల్లనే కొలిక్కి వచ్చి సహకార సంఘంల ఓటరు లిస్టులు తయారు చేయుటకు ఆదేశాలు వచ్చినవి. చేనేత కార్మికుల అలుపెరగని పోరాటాల వలననే సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. పోరాటాలలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు .ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ టెస్కో నుండి కొనుగోలు చేయకుండా అడ్డదారిన ప్రవేశ పెట్టిన టెండర్ల విధానానికి వ్యతిరేకంగా భవిష్యత్ ఉద్యమాలకు సిద్ధం కావాలని చేనేత కార్మికుల కు విజ్ఞప్తి చేశారు.త్రిఫ్ట్ పథకంలో ప్రభుత్వం చేయాల్సిన డిపాజిట్ పది నెలల నుండి చేయడం లేదు.
నేతన్న భీమా పథకంలో టెస్కో నుండి ఇవ్వాల్సిన ఎక్స్ గ్రేషియో రెండు సంవత్సరాల నుండి ఇవ్వడం లేదు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అన్నట్లుగా మన సమస్యల పరిష్కారానికి మనమే ఉద్యమించాలి.ఎవరో వస్తారని ఎదో చేస్తారని భ్రమలో ఉండకుండా
తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఇచ్చే పిలుపు అందుకుని ఉద్యమానికి సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ము