ముద్ర,తాండూరు:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లోని ఇందిరానగర్ లో పునర్ నిర్మించిన శ్రీ రామ్ మందిర్ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఈనెల 23వ తేదీ నుండి ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు, హిందూ సంఘాల నేతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి హిందూ సంఘాల నేతలు ,భక్తులు, భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహక కమిటీ పిలుపునిచ్చారు. పట్టణంలోని దాతలు, భక్తులందరి సహాయ సహకారాలతో వైభవంగా నిర్మితమైన ఈ ఏకైక రామాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఈ నెల 23వ తేదీన ఉదయం 6 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు .ఉదయం 7 గంటల నుండి శ్రీ భద్రప్ప స్వామి హనుమాన్ దేవాలయం నుండి నూతన రామాలయం వరకు మూల విరాట్ల విగ్రహ శోభాయాత్ర ఉంటుందన్నారు.
మార్చి 24: ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీ గణపతి హోమాలు, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
మార్చి 25: అత్యంత కీలకమైన విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనతో పాటు సీతారామచంద్ర మూర్తుల మరియు వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయి.
మార్చి 26: కళ్యాణోత్సవానికి సన్నాహక కార్యక్రమంగా ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరుగుతుందన్నారు.
మార్చి 27: లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర మూర్తుల కళ్యాణోత్సవంతో వేడుకలు అన్నదాన కార్యక్రమం తో ముగుస్తాయని వెల్లడించారు. ఈ ఐదు రోజుల ఆధ్యాత్మిక వేడుకల్లో తాండూరు పరిసర ప్రాంతాల హిందువులు భారీగా పాల్గొని భజన, కీర్తనలతో దిగ్విజయం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు హిందూ సంఘాల నేతలు ఉన్నారు.