Take a fresh look at your lifestyle.

తూర్పు గూడెం గ్రామంలో కోదండ రామాలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ 50 లక్షల నిధులు మంజూరు

  • దేవాలయ నిర్మాణానికి 10 లక్షల ఎండోమెంట్ డిపాజిట్ అలాగే సొంత స్థలాన్ని అందించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు.
  • దేవాలయ మంజూరి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.

తుంగతుర్తి, ముద్ర: తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం నిర్మాణానికి దేవాదాయ శాఖ అనుమతి ఇవ్వడం పట్ల ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ నిర్మాణానికి గాను ఎండోమెంట్ డిపాజిట్ కింద పది లక్షల రూపాయలను అదే గ్రామానికి చెందిన సూర్యాపేట జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు ఇవ్వడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయలు దేవాలయా నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని ఇది తమ గ్రామానికి ఎంతో మేలు చేసే విషయమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక దేవాలయ నిర్మాణానికి దీపికా యుగంధర్ రావు కుటుంబ సభ్యులే తమ సొంత స్థలంలో నిర్మాణానికి స్థలం ఇవ్వడం పట్ల యావత్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు దీపిక యుగంధర్ రావుల ఉదార స్వభావాన్ని గ్రామ అభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషిని కొనియాడారు.త్వరలో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.ఈ సందర్భంగా మాజీ జడ్పీ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు మాట్లాడుతూ తమ గ్రామంలో దేవాలయ నిర్మాణం చేయడం సంతోషకరమని ప్రజలు భక్తి భావంతో మంచివైపు వెళ్లాలని కోరారు.దైవ కార్యానికి తమ కుటుంబానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని మునుముందు తమ గ్రామాన్ని గ్రామస్తులు అందరి సహకారంతో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని అన్నారు. దేవాలయాన్ని మంజూరు చేసిన దేవాదాయ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

Leave A Reply

Your email address will not be published.