Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి

  • జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పెండింగ్ ఉండకుండా ధాన్యం కొనుగోలను వేగవంతంగా స్పీడ్ ఆఫ్ చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండల కేంద్రంలోని చర్లపల్లి, కందెనకుంట గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. వరి ధాన్యం సెంటర్లలో ఉన్న ఇన్చార్జిలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని వెంట వెంటనే ధాన్యము ను రైస్ మిల్లర్లకు తరలించి, అన్లోడ్ వెంటనే చేయించాలన్నారు. వెంటనే ట్యాబ్ డాటా ఎంట్రీ చెయ్యాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని అన్నారు.అదేవిధంగా అధికారులు అలసత్వం వహించి నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులతో మాట్లాడి వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ధాన్యము కొనుగోలు చేసిన వెంటనేత్వరగా మిల్లర్లకు పంపిస్తామని రైతులు ఎలాంటి ఇబ్బందులు వద్దని అన్ని ఏర్పాట్లు లారీ లోడింగ్ అయిన వెంటనే పిల్లలకు పంపుతాం తెలిపారు. కలెక్టర్ వెంట జగిత్యాల రెవిన్యూ డివిజనల్ అధికారి మధు సూదన్ బీర్పూర్ తహసిల్దార్ సుజాత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.