Take a fresh look at your lifestyle.

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎంపికై ఎన్ యస్ వి విద్యార్థుల ఎంపిక

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ఎన్ యస్ వి డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న కామర్ అండ్ మెనెజ్ మెంట్ విద్యార్థులకు బజాజ్ ఫిన్ సర్వ్, రూబికాన్, శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ హోమ్ లోన్స్ ఐ.టి, నాన్ ఐ.టి. విభాగంలో ఉద్యోగాల కోసం కళాశాలలో క్యాపస్ ప్లేస్మెంట్ డైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో నిర్వహించిన ఇంటర్వులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గుగ్గిల్ల శివాణి, బలుసు అఖిల, చెన్న శ్రీజ, గజ్జి ప్రవళిక, గట్టు పూజిత, ఎర్రోజు తేజశ్విని, నీలం మానస, పొన్నం హర్షిని, సిరిపురం మధుమిత, సుంకె వైష్ణవి, పి. దీక్షితలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సంవత్సరానికి రూ. 5 లక్షల ప్యాకేజీ తో ఉండే ఉద్యోగానికి ఎంపిక అయ్యారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ,, అకాడమిక్ డైరెక్టర్ ఎస్. నరేష్, ప్రిన్సిపల్ మునీంధర్ రెడ్డి, అధ్యాపకులు అభినందిచారు.

Leave A Reply

Your email address will not be published.