ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో హ్యాట్రీక్ కౌన్సిలర్లుగా గెలపొందిన వారికి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లుగా అవకాశం లభించింది. చైర్ పర్సన్ బీసీ కోటాలో 12వ వార్డు నుండి గెలుపొందిన పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ని ఇదివరకు రెండు పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్ గా చేసిన అనుభవం ఉన్నందుకు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి పట్లోళ్ల నీరజా వైపు మొగ్గు చూపారు. అదేవిధంగా అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పించాలనే ఉద్దేశంతో మైనార్టీ కోట నుండి హ్యాట్రిక్ కౌన్సిలర్ గా గెలుపొందిన అబ్దుల్ రజాక్ ను వైస్ చైర్మన్ గా నియమించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సాయిపూర్ ప్రాంత వాసుల కలను సహకారం చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు..

అబ్దుల్ రజాక్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా ప్రమాణస్వీకారం