ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లాలో అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిరకిటలాడాయి. ఉదయం నుండి భక్తులు శివాలయాలకు చేరుకొని దర్శనం చేసుకున్నారు. భువనగిరి లోని శ్రీ పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ దక్షిణేశ్వర స్వామి ఆలయం, శ్రీ అమృత లింగేశ్వరాలయం, మాస్ కుంట శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాలలో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాలలో ఆయా దేవస్థానాల కమిటీ సభ్యులు అధ్యక్షులు పాల్గొన్నారు
