Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్‌లో ట్రాన్స్‌జెండర్ల భారీ ధర్నా

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్‌జెండర్లు భారీగా ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం తీసుకువచ్చిన చట్టం తమకు అనుకూలంగా లేదని విమర్శించారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అంబేద్కర్ చౌరస్తా పరిసర ప్రాంతం నినాదాలతో మార్మోగింది.
ట్రాన్స్‌జెండర్లకు సమాజంలో సమాన హక్కులు కల్పించాలని, ఎలాంటి వివక్ష లేకుండా గౌరవప్రదమైన జీవనం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టాల్లో తగిన మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.