Take a fresh look at your lifestyle.

వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో నాట్య నివేదనం

ముద్ర, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా నాట్య నివేదనం జరిగింది.

కరీంనగర్ లోని రాఘవేంద్రనగర్ లోని ఎన్.సీ.ఎన్ కళాక్షేత్రం చిన్నారులు నిశిజ్ఞ, ఆరాధ్య, మణిశాయిసా, సాన్విత, హన్విక, అనన్య, జాన్సీ, అక్షర, శర్వాణి, మహాన్వి, అక్షిత, హర్షిణి వేదికపై తమ నాట్య రూపాలను ప్రదర్శించారు.

నాట్య గురువులు కొట్టం వెంకటేశ్వర్లు, చందన అప్పం  గారిచే శిక్షణ పొందిన చిన్నారులు ఆ వేంకటేశ్వరుడి చెంత తమ అద్భుతమైన నాట్య రూపాలను ప్రదర్శించారు. సాంస్కృతిక కళావేదికపై చిన్నారులను సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు.

 

ఇక బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు హాజరయ్యారు. శ్రీవారిని భక్తులు దర్శించి పులకించిపోయారు. దయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి.

 

Leave A Reply

Your email address will not be published.