Take a fresh look at your lifestyle.

ప్రజలను సీజనల్ వ్యాధుల నుండి కాపాడండి

ముద్ర, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని పలు వార్డులను శుక్రవారం సందర్శించిన జిల్లా తొలి జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా మాట్లాడుతూ..కెసిఆర్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి తో పాటు ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పని చేస్తే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. సానిటేషన్ మీద కనీసం శ్రద్ధ కూడా ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.కవిత కృషి వల్లే రాయికల్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా ఏర్పాటు అయి అభివృద్ధి చెందిందని, కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు రాయికల్ పట్టణ అభివృద్ధి కోసం మంజూరు చేసిన 25 కోట్ల రూపాయలలో ఇంకా రెండున్నర కోట్ల రూపాయల మిగిలి ఉండడంతో ఆ మిగిలిన నిధులతో పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీలను పూర్తి చేయాలని అన్నారు.డ్రైనేజీ లేక వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు బాధపడుతున్నారని వెంటనే డ్రైనేజీలు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టి ప్రజలను సీజనల్ వ్యాధుల నుండి కాపాడాలని అన్నారు.ప్రస్తుతం ఉన్న అసమర్థత సీఎం వల్ల తెలంగాణ అభివృద్ధి కుంటుపట్టిందని అన్నారు.వీరి వెంట రాయికల్ పట్టణ అధ్యక్షులు ఎలిగేటి అనిల్, కో ఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి,మండల అధ్యక్షులు బర్కం మల్లేష్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉదయ శ్రీ, నాయకులు మహేష్ గౌడ్, తిరుపతి, ప్రశాంత్ రావు, రామ్ చంద్ర, వినోద్, ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.