Take a fresh look at your lifestyle.

ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా కళాశాలకు సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి విద్యార్థుల కోసం బెంచీల పంపిణీ

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.

అనంతరం కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం ఎమ్మెల్యే నిధుల నుంచి బెంచీలను అందజేశారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకోవాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత అభివృద్ధి చేయడం తన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కళాశాలకు వచ్చే విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడకుండా నాణ్యమైన రహదారులను నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యా సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, కౌన్సిలర్లు నిజాం, ఆసిఫా బేగం ఖాదర్, పి. రాజేశ్వరి, శంకర్, కూచుకుళ్ల సింధు, వసంత సంతోష్ గౌడ్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.