రైతుల సంక్షేమ ప్రజాపాలన ధ్యేయం
సబ్సిడీ పథకాలను రైతులకు అధికారులు వివరించాలి
ఎమ్మెల్యే మందుల సామెల్
124 మంది రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ
ముద్ర…. తుంగతుర్తి....
దేశానికి అన్నం పెట్టేవాడు రైతు అని, వ్యవసాయ రంగంలో ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీకి సంబంధించి యంత్రాలు ఉపయోగించే రైతులు వ్యవసాయం చేయడం జరుగుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం రాయితీ పై యంత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మందుల సామెల్ హాజరయ్యారు.6 మండలాలకు సంబంధించి అర్హులైన 124 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పత్రము ను వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా వ్యవసాయం యంత్రాల పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన వారికి ప్రభుత్వం తరఫున సబ్సిడీ లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా వివిధ రకాల పనిముట్లను అందజేయడం జరుగుతుందన్నారు.ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతుల అభ్యున్నతీ కి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో కూడా రైతులకు వ్యవసాయ పనిముట్లను అందించడం జరిగిందన్నారు.అదేవిధంగా రైతులకు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ అందజేస్తూ రైతులకు సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లను అందజేయడంతో రైతులు మంచి పంటలను పండించి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగంలో రైతులు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడిఏ రమేష్ బాబు, ఎంపీడీవో శేషు కుమార్, డిప్యూటీ తహసిల్దార్ కంఠమయ్య,తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి,తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న,తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, మద్దిరాల,నాగారం, నూతనకల్, అర్వపల్లి మండలాల అగ్రికల్చర్ అధికారులు అనిషా, కృష్ణ కాంత్, గణేష్, ఆయా మండలాల ఏఈఓ లు, తూర్పు గూడెం, సంగెం సర్పంచులు దాసరి రేణుక శ్రీనివాస్, కలకొట్ల మల్లేష్, 6 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.