Take a fresh look at your lifestyle.

ఎస్ ఎస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించిన సిద్ధార్థ విద్యా సంస్థ

  • ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక 589 మార్కులు సాదించిన విద్యార్థి.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎస్ ఎస్సీ 2025 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థల జ్యోతి,మానస, సూర్య విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. 589 మార్కులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అత్యధిక మార్కులు సాధించిన విద్యా సంస్థగా సిద్ధార్థ విద్యా సంస్థ చరిత్ర సృష్టించింది. 580 మార్కుల పైగా 12 విద్యార్థులు, 570 పైగా 33 , 550 మార్కుల పైగా 94 మరియు 500 మార్కుల పైగా 262 మంది విద్యార్థులు సాధించారు.పరీక్ష కి హాజరు అయిన విద్యార్థులలో 75% పైగా విద్యార్థులు 500 మార్కులు సాధించడం జిల్లా కే గర్వకారణమని కరస్పాండెంటు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్లు శ్రీధర్ రావు, బియ్యాల హరి చరణ్ రావు, మౌనిక రావు, రజిత రావు, తల్లిదండ్రులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.