Take a fresh look at your lifestyle.

దేవుడి ప్రతి రూపమే గురువు

  • నామ జపం ద్వారానే దేవుడి అనుగ్రహం.
  • శ్రీ శ్రీ శ్రీ సద్దురు స్వామిసమర్ధ మహారాజ్ అభిభాషణ.
  • దుబ్బాక ఆశ్రమంలో స్వామి దర్శనం చేసుకున్న జగిత్యాల భక్తులు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: దేవుడి ప్రతిరూపమే గురువని, గురువుకు సేవ చేస్తే చాలని ఆయన అన్ని చూసుకుంటాడని శ్రీ శ్రీ శ్రీ సద్గురు స్వామిసమర్థ మహారాజ్ అన్నారు.గురుపౌర్ణమినీ పురస్కరించుకొని సిద్ధిపేట జిల్లాలోని సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆశ్రమానికి జగిత్యాలకు చెందిన నీలం దశరథ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం మహిళలు, భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.ఈ సందర్బంగా సద్గురు స్వామిసమర్థ మహారాజ్ భక్తులనుద్దెశించి అభిభాషణ చేస్తూ
గురువు వద్ద సద్గుణంతో ఉంటూ గురువు మాటను పాటిస్తూ ఉంటే ఆయన జ్యానాన్ని ప్రసాదిస్తాడని,అందుకు గురువు చూపిన మార్గాన్ని అనుసరించాలన్నారు.గురువు అంటే ఒక పర్వతం, ఒక గుడి లాంటివారని,గురువు దగ్గర అహం ప్రదర్శించకుండా ఉంటే శిష్యులను గురువు ఎప్పుడు పర్యవేక్షిస్తుంటాడని స్పష్టం చేశారు.గురువు, శిష్యులు బంధం జన్మ జన్మల అనుబంధమని చెబుతూ గురువుపై నమ్మకంతో ఉంటే మనకు ఏది కావాలో, సమయం వచ్చినప్పుడు గురువు అడగడకుండానే ఇస్తారని సద్గురు స్వామిసమర్థ మహారాజ్ పేర్కొన్నారు.తల్లి, తండ్రి, గురువు, ధైవాన్ని పూజించండని, నామ జపం ద్వారానే దేవుడీ అనుగ్రహం దొరుకుతుందన్నారు.గురువుకు సంబంధించిన పారాయణం చేస్తే ఆయనే మనకు అన్ని ప్రసాద్దిస్తాడని చెప్పారు.ప్రాపoచిక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి మార్చడమే మనం నమ్మిన దేవుడు ఇచ్చే గొప్ప వరమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ సమాజహితం కోసం పనిచేయాలని సూచించారు.రాష్ట్రo నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఆశ్రమానికి మహిళలు భక్తులు తరలిరాగా క్యూ పద్ధతిలో స్వామివారిని దర్శించుకుని తమ సమస్యలు చెప్పుకుని ఉపశమనం పొందారు.స్వామిని దర్శించుకున్న వారిలో ఎన్నం కిషన్ రెడ్డి, శోభా, నాగరాజు, వంగల కిషన్, ధనుంజయ్, చక్రపాణి, బట్టు రాజు, సభిత, రాణి, వీణ, లహరీ, లావణ్య, దివ్య,తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.