Take a fresh look at your lifestyle.

నరసింహ అవతారానికి స్వాతి నక్షత్రం సందర్భంగా పూజలకు అనుమతిప్పించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి వినతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెళ్లే దారిలో రాయగిరి మల్లన్న గుట్టపై ప్రకృతి సహజసిద్ధంగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి అవతారానికి ప్రతినెల స్వాతి నక్షత్రం సందర్భంగా పూజా, భక్తుల సందర్శనార్థం అటవీ శాఖ అధికారులతో చర్చించి అనుమతులు ఇప్పించాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కోరారు. అటవీశాఖ అధికారులతో చర్చించి సానుకూలంగా స్పందిస్తానని త్వరలో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ యాదాద్రి జిల్లా కార్యదర్శి గీస ఆనంద్, రాయగిరి గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు గడ్డమీది చంద్రయ్య గౌడ్, పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు సుక్కల శ్రీశైలం యాదవ్, బజరంగ్ దళ్ కార్యకర్త బొమ్మ నీరజ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.