Take a fresh look at your lifestyle.

రాష్ట్రస్థాయి క్రీడా సాంస్కృతి ఉత్సవాలు వాయిదా

మోత్కూరు ముద్ర: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల కారణంగా మోత్కూరులో ఫిబ్రవరి 8, 9,10 తేదీలలో నిర్వహించ తలపెట్టిన రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతి కోత్సవాలను వాయిదా వేస్తున్నామని ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రకటించారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భారీ స్థాయిలో నిర్వహించి ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించినట్లు తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనల కారణంగా ఈ క్రీడా సంస్కృతి కోత్సవాలను నిర్వహించలేమని త్వరలోనే ఈ క్రీడా సాంస్కృతి ఉత్సవాలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని సామెల్ వివరించారు. ఎన్నికల కోడ్ను అందరము గౌరవించి, పాటించాల్సిందేనని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా తాము ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని అందుకే వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.ఈ క్రీడా సాంస్కృతి కోత్సవాలను భారీ స్థాయిలో అందరూ పాల్గొనే విధంగా కన్నుల పండువలా నిర్వహించాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ఈ క్రీడా సంస్కృతి కోత్సవాలను యదా తదంగా త్వరలోనే నిర్వహిస్తామని ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు ఏర్పాట్లు అన్ని పూర్తి అయినప్పటికీ ఎన్నికల కోడ్ను పరిగణలోకి తీసుకొని వాయిదా వేయక తప్పడం లేదని ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని అతి త్వరలోనే నిర్వహించబోయే తేదీలను ప్రకటిస్తామని సామెల్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.