- క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రభుత్వ విప్ ….
ఆలేరు. ముద్ర.. నిరంతరం ప్రజల పక్షాన నిలుస్తూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో ముద్ర దినపత్రిక చేస్తున్న కృషిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కొనియాడారు. ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ముద్ర దినపత్రిక ముద్రించిన 2025 క్యాలెండర్ను ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముద్ర దినపత్రిక యాజమాన్యం తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ, ప్రజల పక్షాన నిలవడం గొప్ప విషయంగా అభివర్ణించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడం కోసం ముద్ర దినపత్రిక మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు, యాదగిరిగుట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు గౌడ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు కూళ్ల నరసింహులు, తుంగ కుమార్, పులగం యాత్రిటీ, చింతల సాయిబాబా, బండ్రు జహంగీర్, పర్రె రమేష్, సుంకరి విక్రమ్, అందే అఖిల్, ఊట్కూరి సురేష్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.