కంపెనీల యాజమాన్యాలు అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలోని పరిశ్రమలలో, అగ్ని ప్రమాదాలు, పేలుళ్ళు అవాంఛనీయ సంఘటన లు జరగకుండా కంపెనీల యాజమాన్యాలు తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంత రావు తెలిపారు.
మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ తో కలసి పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు, పేలుళ్ల ను నివారించేందుకు తీసుకోవలిసిన చర్యల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ జిల్లాలోని కర్మాగారాలు మరియు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లను నివారించేందుకు తీసుకోవాల్సిన నివారణ చర్యలపై సమీక్షించారు
జిల్లాలోని రసాయన, బల్క్ డ్రగ్స్ మరియు ప్రమాదకర (హాజరుదొస్) కర్మాగారాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్మికుల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖలు పరస్పర
సమన్వయంతో పనిచేసి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు , భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.అగ్ని ప్రమాదాలు మరియు పేలుళ్ల నివారణ చర్యలు, భద్రతా ప్రమాణాల కఠిన అమలు, కార్మికుల ప్రాణ భద్రత అంశాలపై సమగ్రంగా చర్చించి, వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు.
జిల్లా ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్ మాట్లాడుతూ , జిల్లాలో ఏదైనా ప్రమాదం సంభవించిన సందర్భంలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని, విషపూరిత వాయువులు లేదా పొగ వల్ల చుట్టుపక్కల నివాస ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ప్రజలను సురక్షిత చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ దేవి, డిఐసి రవీందర్, జిల్లా ఫైర్ అధికారి సందేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, నల్గొండ, డ్రగ్ ఇన్స్పెక్టర్బాలకృష్ణ ,సంబంది త అధికారులు పాల్గొన్నారు.