Take a fresh look at your lifestyle.

రాయదుర్గంలోని ఎఫ్.డి.డి.ఐని సందర్శంచిన టి-సాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి

మాదాపూర్, ముద్ర విలేఖరి: హైదరాబాద్ రాయదుర్గంలోని ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవెలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్.డి.డి.ఐ) ను శుక్రవారం టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సందర్శించారు.కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తోన్న ఎఫ్.డి.డి.ఐలో శిక్షణ కోర్సులకు సంబంధించి ఇనిస్టిట్యూట్ ఎగ్జుక్యూటీవ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ నర్సింహ్మాగారి తేజ్ లోహిత్ రెడ్డితో చర్చించారు. ఇనిస్టిట్యూట్ లో నిర్వహిస్తున్న కోర్సులు, శిక్షణ తీరు, యంత్రాల పనితీరు, తరగతి గదుల నిర్వహణను ఈడీతో కలిసి పరిశీలించారు.ఎఫ్.డి.డి.ఐ నిరుద్యోగ యువతకు ఎలా ఉపయోగపడుతోంది, శిక్షణ పొందిన తరువాత ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, శిక్షణ పొందిన వారికి ఎఫ్.డి.డి.ఐ ఏమైనా ప్రోత్సాహాన్ని అందిస్తుందా అనే విషయాలను చర్చించారు.ఇనిస్టిట్యూట్ లోని శిక్షణ విభాగాలను కలియ తిరిగి యువతకు ఇచ్చే శిక్షణ తీరును పరిశీలించి ట్రైనర్లను శిక్షణ విషయాలపై ప్రశ్నించారు.ఇనిస్టిట్యూట్ లో ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబీఏ ఇన్ రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చండైజ్ కోర్సులతో మాస్టర్ డిగ్రీ బోధనలుండగా, ఫుట్ వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, ఫ్యాషన్ డిజైన్, లెదర్, లైఫ్ స్టైల్ అండ్ ప్రాడక్ట్ డిజైన్, బీబీఏ ఇన్ రిటైల్ అండ్ ఫ్యాషన్ మెర్చండైజ్ కోర్సులలో బ్యాచ్ లర్ డిగ్రీలో శిక్షణ ఉంటుందని, ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 350 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని టి-సాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డికి వివరించారు.ఉపాధి శిక్షణ అంశాల్లో భాగంగా టి-సాట్ అండ్ ఎఫ్.డి.డి.ఐ ఎంఓయూ ద్వార ఇక్కడ నిర్వహించే వ్యత్తి నైపుణ్య శిక్షణ కారక్రమాలను ప్రసారాలు చేయాలని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, ఎఫ్.డి.డి.ఐ ఈడీ తేజ్ లోహిత్ రెడ్డి ప్రాథమిక అవగాహనకు వచ్చారు.

  • సివిల్స్ ర్యాంకర్ ను అభినందించిన సీఈవో.

యూపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సివిల్స్ ర్యాంకులతో ఆల్ ఇండియా 350వ ర్యాంకు సాధించిన మూలగాని ఉదయ్ కృష్ణారెడ్డిని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ర్యాంకు సాధించిన సందర్భంగా తన అనభవాలను టి-సాట్ ద్వార పంచుకునేందుకు టి-సాట్ స్టూడియోకు వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఈ సందర్భంగా సన్మానించి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.