జిల్లా అభివృద్ధికి నిధుల పెంచాలి సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం తీవ్రతరం -కలెక్టరేట్ ముందు సిపిఎం ధర్నా
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని సి.పి.ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. ఆడివయ్య అన్నారు. మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో జిల్లా అధికార యంత్రాంగం అలసత్వం వహిస్తుందని విమర్శించారు. జిల్లాలో భూ సమస్యలు, అభివృద్ధి అనగా రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు , ఉపాధి హమీ సమస్యలు సంవత్సరం క్రితం జిల్లా అధికారులకు వినతిపత్రం సమర్పించగా ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పేరుకు జిల్లా కేంద్రం ఏర్పడినా మెదక్ ఎలాంటి ప్రగతికి నోచుకోలేదన్నారు. వెల్దుర్తి, టేక్మాల్, రేగోడ్, నిజంపేట, రామాయంపేట, శివంపేట, చిలప్ చెడ్ మండలాల్లో రోడ్లు అన్ని పూర్తి అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు.

ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి యూనుస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం పార్టీ జిల్లా కార్యదర్శి కే. నరసమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. పద్మ, సి.పి.ఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం, కే.మల్లేశం, కే.నాగరాజు, గౌరయ్య, సంతోష్,అజయ్,నరేందర్, దేవయ్య, శౌకత్, వెంకట్, వసంత తదితరులు పాల్గొన్నారు.