Take a fresh look at your lifestyle.

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

సిపిఐ నియోజకవర్గ ఇంచార్జి పులిజాల పరశురాములు.

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణం మహబూబ్ నగర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు బుధవారం కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా సిపిఐ నియోజకవర్గ ఇంచార్జి పులిజాల పరశురాములు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయి వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతుందని అన్నారు. వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచి పేద ప్రజలను నిండా ముంచుతుందని అన్నారు. ఇప్పటికైనా పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు గడ్డం శ్రీనివాసులు నేరటి రాజు రామస్వామి దుబ్బ ప్రశాంత్ పోలె రాజు గంజి శివుడు భూపాల్ మైబు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.