Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడి బలి

 

యువకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏసిపి ఫయాజ్

ముద్ర, మెహిదీపట్నం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు నిండు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గుడికి వెళ్లడానికి తన దుకాణం నుండి 20 అడుగులు వెళ్ళగానే బస్సు రూపంలో వచ్చిన మృత్యువు అతన్ని కౌగిలించింది. ఈ సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏ సి పి సయ్యద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్ వెంకటరాములు తెలిపిన ప్రకారం…. అత్తాపూర్ లో నివాసముండే ముఖేష్ అగర్వాల్ లంగర్ హౌస్ బాపు ఘాట్ పక్కన హార్డ్వేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజువారిలా తన ఏకైక కుమారుడు ఉమంగ్ అగర్వాల్(22) తో కలిసి దుకాణానికి వచ్చారు. ఆ తర్వాత దుకాణంలో పూజ చేయడానికి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి నీరు తెస్తా అని ఉమంగ్ ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. 20 అడుగులు దూరం వెళ్లగానే ఆర్టిసి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ఎడమవైపుకు మళ్ళించాడు. ఈ సమయంలో బస్సు తగిలి ఉమాంగ్ కింద పడిపోగా అతనిపైనుండి బస్సు చక్రాలు వెళ్లి అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ సంఘటన స్థలానికి చేరుకునే ప్రయత్నం చేయగా, ఇక్కడికి వస్తే ధర్నాలు చేస్తారు అని పోలీసులు ఫోన్లో మెసేజ్ చెప్పడంతో వెన్ను తిరిగాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.

Leave A Reply

Your email address will not be published.