ముద్ర ప్రతినిధి, మెదక్:
నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాలలో భగ్గీల పోటీ నిర్వహించారు. అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలంటే కష్టపడే తత్వం అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
