1.రియల్ ఎస్టేట్ బ్రోకర్ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు
2. మూసి ముంచక పోయిన సుందరీకరణ పేరుతో మీరు ముంచాలా అని ప్రకార్డులు ప్రదర్శిస్తు

– కొడంగల్ లో ఎఫ్టిఎల్లో ఉన్న రేవంత్ రెడ్డి ఇల్లు కూల్చే దమ్ముందా
– అధికార అహంతో పేదల ఇండ్లు కూలిస్తే, నీ కుర్చీ కూల్చే రోజులు దగ్గరలో ఉన్నవి రేవంత్
– నగరంలో బఫర్ జోన్ లో ఉన్న మంత్రుల ఇళ్ల సంగతి ఏమిటి
– బఫర్ జోన్ 50 మీటర్లు పెంచడానికి నీ అబ్బ జాగీరా
ముద్ర ప్రతినిధి, బండ్లగూడ:
రియల్ ఎస్టేట్ బ్రోకర్ మన రాష్ట్రాన్ని నడుపుతున్నాడని, రెండు సంవత్సరాలు ఇళ్లను కాపాడుకోండని మాజీమంత్రి, బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తర్వాత తామే అధికారంలోకి వస్తామని ఆ తర్వాత ఇంటి సున్నం కూడా ఎవరూ ముట్టుకోకుండా కాపాడే బాధ్యత మాది అన్నారు. మూసి దండి మార్చ్ పేరుతో మూసి బాధితులకు భరోసా కల్పిస్తూ ఆయన ముసి పరివాహక ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. గంధం గూడ, కేకే నగర్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లలో బాధితులతో కలిసి వారి బాధలు విన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…. 9 మీటర్లు ఉన్న బఫర్ జోన్ ని 50 మీటర్లకు పెంచడానికి అది నీ అబ్బ జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ కి ఓటు వేయలేరని కోపంతో 1,50,000 ఇండ్లను కూల్చి రోడ్డున పడేయడానికి సిద్ధమయ్యారన్నారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం నగరంలో 200 కోట్లతో రెండవ ఇల్లు కడుతున్నాడని, బట్టి ఉన్నవి సరిపోక మూడో ఇల్లు కడుతున్నాడని మీకు మూడేళ్లు కావాలి కానీ పేద వాళ్లకు ఇల్లు ఉంటే కూలగొడతారని ప్రభుత్వం పై మండిపడ్డారు. తాము ఒక్క ఇల్లు కూల్చకుండా ఐదు కిలోమీటర్ల వరకు మూసిని అభివృద్ధి చేశామని అలా మూసీని అభివృద్ధి చేస్తే స్వాగతిస్తామన్నారు. కాకికి నొప్పి చేస్తే అన్ని కాకులు అక్కడ వాలుతాయని అదే విధంగా బాధితులు ఇక్కడ సమస్య ఎదురైనా అందరూ అక్కడ వాళ్ళ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కే కాదు స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఇక్కడి ప్రజల బాధలు పట్టట్లేదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ తో పెళ్లి చేసుకుని కాంగ్రెస్తో కాపురం చేస్తున్నారని, రేవంత్ కూడా కాంగ్రెస్ తో పెళ్లి చేసుకుని బిజెపితో కాపురం చేస్తున్నారన్నారు.
రేవంత్ కట్టే ఓటర్లు బఫర్లో ఉండొచ్చా…..
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో బాధితులతో మాట్లాడిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ….. మధు పార్క్ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉండొద్దు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ కట్టే ఫోటోలు మాత్రం బఫర్ జోన్ లో ఉండొచ్చా ఇదేమి లాజిక్ అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ లో ఉంది, మంత్రి పొంగులేటి ఇల్లు హిమాయత్ సాగర్ బఫర్ జోన్లో, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు మధ్యలో ఉందని మరి వీటి పరిస్థితి ఏమిటి అన్నారు. 16 వేల కోట్లతో అయిపోయే దానికి లక్ష యాభై కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారో ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ కార్తీక్ రెడ్డిలు ఉన్నారు.