Take a fresh look at your lifestyle.

మున్సిపల్ చైర్ పర్సన్ ను సన్మానించిన తాండూర్ కురుమ సంఘం సభ్యులు

 

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లోని శ్రీ బీరప్ప స్వామి సమావేశ భవనంలో తాండూర్ డివిజన్ కురుమ సంఘం ఆధ్వర్యంలో నూతన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి ని శాలువా కప్పి, గజమాలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ సభ్యులు చైర్ పర్సన్ కు జ్ఞాపకార్థంగా వారి ప్రమాణ స్వీకారోత్సవ ఫోటోను మరియు భగవద్గీతను అందించి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పట్టణంలోని యశోద నగర్ పార్కులో దొడ్డి కొమరయ్య విగ్రహం దగ్గర పలు అభివృద్ధి పనులు చేయాలని, అదేవిధంగా బీరప్ప స్వామి దేవాలయం దగ్గర భక్తుల సౌకర్యార్థం త్రాగునీటి కొరకు బోర్ వేయించాలని, పట్టణంలో అధిక సంఖ్యలో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని సంఘ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి కురుమ సంఘ సభ్యుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారికి న్యాయం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో తాండూర్ డివిజన్ కురుమ సంఘ సభ్యులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.