ముద్ర ప్రతినిధి, నిర్మల్:
విద్యుత్ వినియోగంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్ ఈ సుభాష్ సూచించారు. విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించాలని అన్నారు. ఇందుకోసం సిబ్బంది అంకితభావంతో పని చేయాలని కోరారు. లైన్ల మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఈ నాగరాజు, అకౌంట్స్ అధికారి దిగంబర్, ఈ డి శ్రీనివాస్ తదితరులున్నారు.