- ముఖ్య అతిధులుగా పాల్గొన్న తానా ప్రెసిడెంట్ నిరంజన్ , ముద్ర ఎండీ కే. సత్యనారాయణ
ముద్ర , హైదరాబాద్ : మణికొండ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కేలండర్ ఆవిష్కరణకు తానా ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్ , ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యులు , ముద్ర ఎండీ కే. సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై కేలండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
కాకతీయ సేవా సమితి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సందర్బంగా హాజరైన అతిధులందిరినీ సన్మానించారు. కమ్మ సామాజికవర్గంలోని వివాహాలతో పాటు, పేదరికంతో చదువుకోలేకపోతున్న కమ్మ విద్యార్థులకు, అనారోగ్యంతో ఉన్న పేదవారికి ఆర్థిక సాయం అందజేస్తున్నామని ప్రెసిడెంట్ కమ్మ బ్రహ్మాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ప్రత్తిపాటి మాల్యాద్రి, జనరల్ సెక్రెటరీ వీరగంధం వీరభద్ర రావు, కోశాధికారి తూమాటి శివశంకర్, జాయింట్ సెక్రటరీ జాస్తి సతీష్ కుమార్, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ చావ వినయ్ కుమార్, బండారుపల్లి ధనుంజయ రావు తమ్మిన రఘు, శృంగవరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు.