ఎన్ పిఆర్ డి రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్.. శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని పిలుపు…
ముద్ర, యాదగిరిగుట్ట :
ఈ నెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్.పి.ఆర్.డి) రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల వాల్ పోస్టర్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురునెల్లి వెంకట్ మాట్లాడుతూ వికలాంగుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం నాయకత్వ పటిమను పెంపొందించేందుకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. .
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ( ఎన్ పి ఆర్ డి) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా నాయకులు పాండాల శ్రీహరి, నరేష్ నాయక్ పాల్గొన్నారు.