ముద్ర ప్రతినిధి,, మెదక్:
జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ద్వారకా నగర్ హనుమాన్ దేవాలయం నుండి ఈ శోభాయాత్ర ప్రారంభమై ఆటోనగర్, పాత బస్టాండ్ రాందాస్ చౌరస్తా పోస్ట్ ఆఫీస్ మీదుగా పట్టణంలో పెద్ద ఎత్తున సాగింది. ఎత్తయిన హనుమాన్, శ్రీరాముని ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేక లైట్ల ప్రభలు ముందు నడవగా మహిళలతో పాటు యువకులు, హిందువులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు మారుమ్రోగాయి. బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంఎన్ కెనాల్ బ్రిడ్జి వద్ద, పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.