Take a fresh look at your lifestyle.

ఏడుపాయలలో అలరించిన సంస్కృతిక ప్రదర్శనలు

 

ముద్ర ప్రతినిధి, మెదక్:


 
ఏడుపాయల వన దుర్గ అమ్మ వారి జాతర సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారధి
స్థానిక కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, జానపద గీతాలు, కోలాటం వంటి సంప్రదాయ కళారూపాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. ప్రత్యేకంగా యువతుల బృందం ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం అందరినీ ఆకర్షించింది.
కడ్లకారులను సత్కరించారు.
కళలతో చైతన్యం: డిపిఆర్ఓ
డిపిఆర్ఓ రామచంద్ర రాజు మాట్లాడుతూ.. నేటి సమాజాన్ని చైతన్య పరిచేవి కలలని, కవులు, కళాకారులకు మెట్టినిల్లు మెదక్ జిల్లా అని పేర్కొన్నారు. కళలు భక్తి, సంస్కృతిని పరిరక్షించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. మంచి నైపుణ్యం గల కళాకారులు జిల్లాలో అనేక మంది ఉన్నారని, వారు చేసే సాంస్కృతి సాంప్రదాయాలు నేటి తరానికి కనువిందు చేస్తాయని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.