ముద్ర, నారాయణపేట:
కొన్ని నెలల నుంచి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేదు. గతంలో ఓ మారు ఎమ్మెల్యే కాలుకి గాయమైంది. ఈ సమయంలో డాక్టర్లు నడవకుండా ఎమ్మెల్యేకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యే చాలా రోజులు నారాయణ పేట నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఎక్కడా కూడా ప్రచారానికి పూర్తి దూరంగా ఉన్నారు. కానీ నారాయణపేట మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కు ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు అనివార్యం కావడంతో ఆదివారం సివిఆర్ బంగ్లాకు ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి చేరుకుంది. అయితే చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు గట్టి ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్యే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది.