కూకట్‌పల్లిలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన టి పి సి సి ఉపాధ్యక్షులు బండి రమేష్
హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ఫిబ్రవరి 15:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా శివనామస్మరణ మారుమోగింది. నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీల ఆహ్వానం మేరకు టి పి సి సి ఉపాధ్యక్షులు కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పలు దేవాలయాలను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐ డి యల్ రోడ్డులోని శ్రీ పాప నాశేశ్వర దేవాలయం , కూకట్‌పల్లిలోని పాత శివాలయం, మరియు పాండురంగ నగర్‌లోని శివాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన శివునికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
పూజా కార్యక్రమాల అనంతరం బండి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. దేవాలయాల వద్ద విద్యుత్ దీపాలంకరణ, పారిశుధ్యం, మంచినీటి సదుపాయం మరియు పోలీస్ బందోబస్తు వంటి ఏర్పాట్లు ఘనంగా చేశామని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గొట్టిముక్కుల వెంకటేశ్వర్ రావు, వివిధ ఆలయ కమిటీల సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.