Take a fresh look at your lifestyle.

కచ్చితంగా నిఘా వైఫల్యమే

  • పహల్గాం ఉగ్రదాడి జాతీయ సమస్య.
  • ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాల్సిందే.
  • ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : పహల్గాం ఉగ్రదాడి జాతీయ సమస్య అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.ఉరి, పుల్వామాలలో జరిగిన దాడుల కంటే పహల్గాంలో జరిగినది భారీ దాడి అని అన్నారు.ఈమేరకు గురువారం ఢిల్లీలో మీడియాతో ఓవైసీ మాట్లాడారు.ఈ అంశంపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.పహల్గాంలో మతం ఏంటని అడిగిమరీ చంపడం దారుణమని అన్నారు.ఉగ్రవాదులు అమాయకప్రజలను విచక్షణరహితంగా కాల్చిచంపడం ఘోరమైన చర్య అని ఆయన అన్నారు.ఈ దాడిని ఎంఐఎం పార్టీగా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఇది కచ్చితంగా నిఘా వ్యవస్థ వైఫల్యమే అని అన్నారు.జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరోధక విధానం పనిచేస్తోందో లేదో పరిశీలించుకోవాలన్నారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పి, బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.