ముద్ర ప్రతినిధి, మెదక్:
కులం, సామాజిక సమానత్వం, న్యాయం కోసం పోరాడిన వీర యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవితం నేటి తరానికి ఆదర్శమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
గురువారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అణచివేతకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు మంగా రమేష్ గౌడ్, రేణుక ఎల్లమ్మ ఆలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ విధ్యాధర్ గౌడ్, సంఘ నాయకులు నర్సింహులు గౌడ్, సురేందర్ గౌడ్, నాగరాజు గౌడ్, యాదగిరి గౌడ్, శంకర్ గౌడ్, కుమార్ గౌడ్, సహాయ వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి గంగా కిషన్, కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్, లవన్, భాను ప్రకాష్, ఆరీఫ్, నర్సింహులు, సిద్దరాములు, తదితరులు పాల్గొన్నారు.
చిల్వర్ గ్రామసభలో పాల్గొన్న అదనపు కలెక్టర్ నగేష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యచరణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అల్లాదుర్గ్ మండలం చిల్వర్ గ్రామపంచాయతీ వద్ద నిర్వహించిన గ్రామసభలో అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు. అర్హతలను బట్టి పథకాల లబ్ధిదారులను గ్రామ సభ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సభలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను, పొందిన లబ్ధిని పంచాయితి కార్యదర్శి ఆర్. లింగప్ప చదివి వినిపించారు. సర్పంచ్ ముక్కెర శశిధర్ రెడ్డి ఉప సర్పంచ్ చాకలి లక్ష్మి, వార్డు సభ్యులు ప్రత్యేక అధికారి ఏ. వైష్ణవి, మండల వైద్యాధికారి సారిక, పంచాయతీ కార్యదర్శులు లింగప్ప, ఇతర అన్ని శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.