Take a fresh look at your lifestyle.

సేంద్రియ సాగుకు రైతులు ముందుకు రావాలి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

 ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

కొండపాక మండలం దుద్దెడ గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామ సభలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ కే.హైమావతి పాల్గొన్నారు. ముందుగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభను ఉద్దేశించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి పంపించిన సందేశాన్ని గ్రామస్తులకు చదివి వినిపించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను వివరించి దుద్దెడ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులను సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారుల వారిగా వివరించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి తదితర పథకాల లబ్దిదారులు వారి అనుభవాలను సభలో వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించాలంటే సేంద్రియ వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలని, పంట మార్పిడి విధానం పాటించాలని, గ్రామంలో కోతుల బెడదను నివారించాలని, అర్హత ఉన్న పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనివ్వాలని గ్రామపంచాయతీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఐదు అంచెలుగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా 508 గ్రామపంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని మరియు ఐదు మున్సిపాలిటీలలో వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి కోసం గ్రామాలు, పట్టణాలలో మౌలిక వసతులను కల్పించడమే కాకుండా మహాలక్ష్మి, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, మహిళ స్వయం సహాయ సంఘాలకు వడ్డీ లేని రుణాలు, రైతు భరోసా, రైతు బీమా తదితర ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా ఎదిగే వయసులో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా జూన్ నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం, ప్రీ ప్రైమరీ స్కూల్ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం అమలు చేయడం జరుగుతుందని, ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగుల విద్యార్థుల కొరకు వాహన సౌకర్యం కల్పించడం జరుగుతుందని, కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి, ఎంపీడీవో, గ్రామ ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.