ముద్ర , కుషాయిగూడ:
రంజాన్ పండుగ పురస్కరించుకొని జిహెచ్ఎంసి 4వ డివిజన్ పరిధిలో కుందన్ పల్లి రామలింగేశ్వర కాలనీలో … పలువురు ముస్లిం కుటుంబాలకు మాజీ కౌన్సిలర్ వరగంటి వెంకటేష్ రంజాన్ కానుకలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పవిత్ర రంజాన్ మాసం మతసామరస్యానికి, సోదర భావానికి ప్రతీతగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజారెడ్డి, శ్రీనివాస్, చంద్రయ్య, రవీందర్ రెడ్డి ,రమేష్, అబ్బాస్, పాషా, కయూము, ఖాజ, పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.