ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భూమి లేని వ్యవసాయ కూలీలకు 12 వేలు, మహిళలకు నెలకు 2500ల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఎమ్మెల్యేలను, మంత్రులను, కాంగ్రెస్ నాయకులను గ్రామ గ్రామాన ప్రజలు నిలదీయాలని, ప్రశ్నించాలని అఖిల భారతీయులు వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్ షాప్ జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసి కేరళ రాష్ట్రంలో కూడా ప్రజలను కాంగ్రెస్ తరపున మోసం చేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ఇతర రాష్ట్రాల్లో తప్పుడు ప్రచారం చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రసాద్ ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు నేటికీ పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వలేదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లల పెంటయ్య, గంగాదేవి సైదులు, రాచకొండ రాములమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, జూకంటి పౌల్, జిల్లా సహాయ కార్యదర్శిలు సిరిపంగి స్వామి, గుంటోజి శ్రీనివాస్ చారి, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డి బిక్షపతి, బొడ్డు కిషన్, కొండపురం యాదగిరి, మానే సాలయ్య, బొల్లెపల్లి కిషన్, పద్మ, బాలరాజు, ముకుంద, హనుమంతు, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.