- జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్.
సూర్యాపేట న్యూస్ మహిళా లను కోటేశ్వరులను చేయడం ప్రభుత్వ లక్ష్యం మని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ అన్నారు బుధవారం మండల పరిధిలోని టేకు మట్ల గ్రామం లో ఏర్పాటు చేసిన ఇందిర మహిళ శక్తి సంబరాలు జులై 9 నుంచి 11 వ తేదీ వరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డి ఆర్ డి ఏ ఆద్వర్యం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పర్యవేక్షణ లో జిల్లా లోని 23 మండలలో ప్రతి గ్రామంలో మహిళా శక్తి పైన అవగాహన కల్పించడం జరుగుతుందని లక్ష్మణ్ చెప్పారు స్వయం సహాయక గ్రూప్ కు చెందిన ప్రతి ఒక్కరు తాము ఎంపిక చేసుకున్న యూనిట్ తో ఉపాధి అవకాశాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చేయడమే కోసమే ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలియ జేశారు ఇప్పటికే తీసుకున్న రుణాలకు సంబంధించి నేరుగా బ్యాంకు లో చెల్లింపులు చేయాలని మధ్యవర్తులకు ఏ లాంటి డబ్బులు లావాదేవీలు చేయ వద్దని కోరారు తీసుకున్న రుణం వాయిదాల పద్ధతిలో క్రమం తప్పకుండా చెల్లించడం తో ప్రభుత్వం అందించే సబ్సిడి లు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమం లో తెలంగాణ సాంస్కృతిక సారధి కళా కారులు పాల కుర్తి శ్రీకాంత్ పల్లెల రాము గంట భిక్ష పతి గడ్డం ఉదయ్ మాగి శంకర్ పాక ఉపేందర్ కుందమల్ల నాగ లక్ష్మీ గజ్జి మంజుల సిరి పంగి రాధ మల్లమ్మ వి బి కె హేమ లత గ్రామ మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.